సమ్మోహనం మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!! | 123Josh.com
Home న్యూస్ సమ్మోహనం మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

సమ్మోహనం మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

0
3954

         టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమాలు అంటే చాలామందికి ఇష్టం, సెన్సిబుల్ కామెడీతో అష్టాచమ్మా, అమీతుమీ లాంటి అద్బుతమైన సినిమాలు తీసిన మోహన కృష్ణ అంతకుముందు ఆ తర్వాత లాంటి సెన్సిబుల్ లవ్ స్టొరీ లను కూడా తెరకెక్కించారు. ఇప్పుడు సుధీర్ బాబు అదితిరావ్ హైదరి ల కాంబినేషన్ లో సమ్మోహనం అంటూ మరో క్లాస్ లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండి…ముందుగా కథ ఏంటి అంటే….హీరో ఒక తెలుగు బుక్ రైటర్ సినిమా వాళ్ళు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అనుకోకుండా తెలుగు రాని హీరోయిన్ కి తెలుగు ట్రైనర్ గా చేయాల్సి వస్తుంది హీరో కి.

మొదట్లో నచ్చకపోయినా తర్వాత తర్వాత ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు, కానీ హీరోయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది తెలుసుకున్న తర్వాత వీరి లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది మిగిలిన కథ గా చెప్పుకోవచ్చు.

మోహనకృష్ణ సినిమాలు ఎక్కువగా క్లాస్ గా ఉంటాయి, స్లో గా ఉన్నా అందరికీ ఎక్కేస్తాయి. సమ్మోహనం విషయంలో ఇదే జరిగింది అని చెప్పొచ్చు. సినిమా స్లో గా స్టార్ట్ అయ్యి స్లోగా నడుస్తున్న కథ లో ఇన్వాల్వ్ అయిపోతాం. మధ్య మధ్యలో బోర్ కొట్టిన ప్రతీ సారి సీనియర్ యాక్టర్ నరేష్ వచ్చి నవ్విస్తాడు.

సినిమా మొత్తం ఇలాగే సాగుతుంది, పూర్తిగా లవ్ స్టొరీ ని చెప్పడమే కాకుండా హీరోయిన్స్ కి ఇండస్ట్రీ లో ఎదురయ్యే పరిస్థితులు ఇలాంటివి అన్నవి కూడా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. లీడ్ పెయిర్ అదితి రావ్ హైదరి మరియి సుధీర్ బాబు అద్బుతంగా నటించి మెప్పించారు.

హీరోయిన్ కి మరింత ఎక్కువగా నటించే స్కోప్ ఉండగా అదితి రావ్ హైదరి మరింత ఆకట్టుకుంది. సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంది. ఎడిటింగ్ బాగున్నా కొన్ని బోర్ సీన్స్ ని షార్ప్ గా ఎడిట్ చేసి ఉంటె మరింత ఫాస్ట్ గా ఉండేది.

ప్రొడక్షన్ వాల్యూస్ సాంకేతిక వర్గం పనితీరు మిగిలిన నటీనటులు అందరు ఆకట్టుకుంటారు…దర్శకుడు ఇంద్రగంటి తీసిన మరో క్లాస్ మూవీ గా సమ్మోహనం సినిమాను చెప్పుకోవచ్చు. సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓ క్లాస్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కంటిన్యు అవుతుంది.

మొత్తం మీద సినిమా క్లాస్ ఆడియన్స్ కి లవర్స్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే వారికి సినిమా బోరింగ్ గా అనిపించడం ఖాయం. కానీ అవన్నీ తట్టుకుని సినిమా మొత్తం చూసి థియేటర్ నుండి బయటికి వచ్చే సమయంలో క్లాస్ లవ్ స్టొరీ చూశాం అనిపిస్తుంది.

123జోష్ రేటింగ్—2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here