సప్తగిరి LLB రివ్యూ….సూటిగా సుత్తి లేకుండా!!

0
612

  కామెడీ రోల్స్ చేస్తూ సినిమాలో మేజర్ హైలెట్ గా నిలుస్తు తనకోసమే ఆడియన్స్ సినిమాకి వచ్చేలా చేసిన అతికొద్ది మంది కమెడియన్స్ లో సప్తగిరి ఒకరు…కెరీర్ తొలినాళ్ళలోనే మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ఇప్పుడు హీరోగా మారి మొదటి ప్రయత్నంలో కొంతవరకు ఆకట్టుకోగా ఇప్పుడు రెండో ప్రయత్నంగా బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన జాలీ LLB మూవీ ని తెలుగు లో సప్తగిరి LLB గా రీమేక్ చేశాడు….

కాగా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…హిందీ వర్షన్ నే మెయిన్ ప్లాట్ గా తీసుకుని హైలెట్ సీన్స్ అన్ని పేర్చి…ఇక్కడ లోకాలిటికీ నచ్చే విధంగా పలు మార్పులు చేర్పులు చేశారు…అది చాలా వరకు ఫలించింది అని చెప్పొచ్చు.

ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉండగా నటుడిగా సప్తగిరి మరో మెట్టు ఎక్కాడు అని చెప్పొచ్చు… చివరి 30 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు అని చెప్పొచ్చు. ఆ ఎపిసోడ్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఒరిజినల్ నే తీసుకుని మంచి పని చేశారు.

దాంతో సినిమా ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే ఆడియన్స్ కి మంచి సినిమాగాను…అలాగే హిందీ వర్షన్ చూసిన వాళ్ళకి ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉందని చెప్పొచ్చు. ఈ వీకెండ్ సప్తగిరి LLB ని ఎలాంటి డౌట్ లేకుండా ఒకసారి హాయిగా చూడొచ్చు…చిన్నపాటి మెసేజ్ ని మనతో తీసుకెల్లోచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here