సెప్టెంబర్ 10 న ఆ అద్బుతం జరిగే అవకాశం…ఫ్యాన్స్ వెయిటింగ్

0
1327

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సరికొత్త మూవీ జైలవకుశ సినిమా అభిమానులు అందరు ఎప్పు డెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 21 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ ఈ రోజు అత్యంత భారీ ఎత్తున జరగ బోతుండగా ఈ రోజు ఈవెంట్స్ లో అనేక సర్ప్రైజ్ ఎలి మెంట్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ లో చెప్పు కుంటుండటం విశేషమనే చెప్పాలి.

కాగా ఈ ఈవెంట్ లో సినిమాలోని 4 సాంగ్ టీసర్లు, కుదిరితే ఐటమ్ సాంగ్ టీసర్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. కాగా ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్స్ గా చాలామందే అనుకున్నా యూనిట్ సభ్యులతో పాటు టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కూడా ఉండే అవకాశం ఉందట.

చాలా కాలంగా ఎన్టీఆర్ ఆడియో ఈవెంట్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నా జక్కన్న ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉందని అదే సమయంలో వీరి కలయికలో సినిమా అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని ఇప్పుడు టాక్ నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here