యూట్యూబ్ రికార్డుల రారాజు ఫైనల్ వార్ సెప్టెంబర్ 5 న…కాచుకోండి

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషన్ జైలవకుశ సినిమా లోని మొదటి రెండు పాత్రల లుక్స్ మరియు టీసర్లు రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా ఇప్పుడు అందరు మూడో పాత్ర అయిన కుశ గురించి తెలుసు కోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే త్వరలోనే అంటూ వస్తున్న ఈ టీసర్ రిలీజ్ డేట్ విషయం లో కొన్ని మార్పులు రాగా ఇప్పుడు ఓ డేట్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.

ఆ టాక్ ప్రకారం ఈ నెల 5 వ తేదిన సినిమా లోని కుశ టీసర్ ని రిలీజ్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఉదయం 10 కి గాని సాయంత్రం 5 కి గాని రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటుండటంతో ఇప్పుడు అందరు ఇది జరగాలి అని కోరు కుంటున్నారు.

కాగా అతి త్వరలోనే దీని పై ఓ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం…ఇక 10 న ఆడియో సక్సెస్ మీట్ ని అలాగే సెప్టెంబర్ 21 న సినిమాను ఓ రేంజ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలలో యూనిట్ ఉన్నట్లు సమాచారం…

Leave a Comment