GST లో కూడా ఊచకోతే…సౌత్ టాప్ 5 చోటు

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 81.5 కోట్ల షేర్ ని 145 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా సంచలన రికార్డ్ నమోదు చేయగా GST వలన సినిమాకు గట్టి ఎదురుదెబ్బ తగిలి సుమారు 8 కోట్ల మేర నష్టపోయినట్లు సమాచారం. కాగా ఇన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఇయర్ టాప్ 3 గ్రాసర్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచింది.

అదే విధంగా సౌత్ లోను ఈ ఇయర్ టాప్ 5 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా. కాగా టాప్ లో బాహుబలి, 2 వ ప్లేస్ లో మెర్సల్ ఉండగా మూడో ప్లేస్ లో మెగాస్టార్ ఖైదీనంబర్ 150 చోటు దక్కించుకుని సంచలనం సృష్టించింది.

కాగా 4 వ ప్లేస్ లో జైలవకుశ 145 కోట్ల గ్రాస్ తో ఎంటర్ అవ్వగా 5 వ ప్లేస్ లో అజిత్ వివేగం అఫీషియల్ గా 138 కోట్ల గ్రాస్ తో 5 వ ప్లేస్ లో నిలిచాయి. ఆ ఇయర్ మిగిలిన రోజుల్లో భారీ సినిమాలు లేకపోవడం తో ఇవే టాప్ 5 లో నిలిచే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment