మహేష్ స్పైడర్ 6 వ రోజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తున్నా అవి ప్రీ రిలీజ్ బిజినెస్ కి మ్యాచ్ అవ్వక పోవడం తో కలెక్షన్స్ తో ఎవ్వరూ సాటిస్ ఫై అవ్వడం లేదు. మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్పైడర్ సినిమా స్టడీ కలెక్షన్స్ ని 6 రోజుల దాకా దక్కించుకుందని చెప్పొచ్చు. గాంధీ జయంతి రోజున సినిమా కలెక్షన్స్ పర్వాలేదు అనిపించాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 వ రోజున సినిమా 1.86 కోట్ల మేర షేర్ ని వసూల్ చేసిందని సమాచారం. అందులో నైజాంలో 90 లక్షల వరకు షేర్ ఉండగా సీడెడ్ లో 20 లక్షల వరకు షేర్ ఉన్నట్లు సమాచారం. మిగిలిన ఏరియాలలో 76 లక్షల దాకా షేర్ వసూల్ చేసింది ఈ సినిమా.

కాగా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద 35 లక్షల దాకా షేర్ వసూల్ చేసిన స్పైడర్ మొత్తం మీద 6 వ రోజున 2.2 కోట్లదాకా షేర్ వసూల్ చేసింది. దాంతో టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు 48.5 కోట్లకు అటూఇటూగా ఉన్నట్లు సమాచారం. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment