స్పైడర్..జైలవకుశ ఫెయిల్….పవన్ రికార్డ్ కొట్టేదెవరు??

0
1904

  ఒక సినిమా సాధించిన రికార్డులను మరో సినిమా బ్రేక్ చేయడం…. మళ్ళీ మరో సినిమా సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టించడం అనేది కామన్ గా జరుగుతూనే వస్తుంది… కాగా టాలీవుడ్ లో బాహుబలి రాకతో చాలా వరకు రికార్డులు ఆ సినిమా పేరిటే ఉండగా ఇప్పుడు ఆ సినిమాను పక్కకు పెట్టి మిగిలిన సినిమాల్లో ఉన్న రికార్డుల గురించి మాట్లాడు కుంటున్నారు. చాలా వరకు కొత్త సినిమాలు పాత సినిమాల రికార్డులు బ్రేక్ చేశాయి.

కానీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో నైజాంలో సాధించిన 23.75 కోట్ల షేర్ రికార్డ్ మాత్రం 4 ఏళ్ళు అయిపోతున్న చెక్కు చెదరకుండా అలాగే ఉంది…ఈ ఏడాది రిలీజ్ అయిన క్రేజీ సినిమాలు కూడా ఆ రికార్డ్ ను అందుకోలేకపోయాయి.

స్పైడర్…జైలవకుశ సినిమాలలో ఓ సినిమా బ్రేక్ చేస్తుంది అనుకున్నా…పోటి… టాక్…పరిస్థితులు మరియు GST వలన ఆ రికార్డ్ ను ఎవ్వరు బ్రేక్ చేయలేదు…దాంతో పవన్ రికార్డును బ్రేక్ చేయడానికి ఇప్పుడు స్వయంగా పవన్ అజ్ఞాతవాసి తో బరిలోకి దిగుతున్నాడు. మరి పవన్ తన రికార్డ్ ను బ్రేక్ చేసి మరో సంచలన బెంచ్ మార్క్ ని సెట్ చేస్తాడా లేదో చూడాలి. మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here