బ్రహ్మోత్సవం డిసాస్టర్ తర్వాత 2 ఏళ్లకి అడ్డాల మూవీ…హీరో ఎవరో తెలిస్తే షాక్!!

0
840

టాలీవుడ్ లో ప్రస్తుతం గ్యాప్ లేకుండా షూటింగ్ లలో పాల్గొంటున్న హీరోలలో శర్వానంద్ ఒకరు. మనోడితో సినిమా చేస్తే మినిమమ్ వసూళ్లు రావడం గ్యారెంటీ అని నిర్మాతలు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ సినిమా తరువాత సుదీర్ వర్మతో ఒక ప్రాజెక్ట్ ను లాక్ చేశాడు.  అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా ఈ ఫెస్టివల్ హీరో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ అడ్డాలా బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో కాస్త గ్యాప్ ఎక్కువగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు సమయాన్ని వృధా చేయకుండా శ్రీకాంత్ మంచి కథను సెట్ చేసుకున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ వారితో సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేయడంతో కథ వినగానే శర్వా కూడా ఒకే చెప్పేశాడట. 

అయితే శర్వా హను రాఘవపూడి సినిమా అయిపోగానే సుదీర్ వర్మతో చేయాలనీ అనుకున్నాడు. కానీ ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్టును త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హను ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా ఫినిష్ చేసి శ్రీకాంత్ సినిమాను పట్టాలెక్కించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా బ్రదర్స్ సెంటిమెంట్స్ తరహాలో ఉంటుందని టాక్. మరి శ్రీకాంత్ ఈ కథతో అయినా ఫామ్ లోకి వస్తాడా లేదా చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here