ఆ 2 సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు నేను స్టార్ అయ్యే వాడిని!!

0
1481

  హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా యువ కథానాయకుడు సందీప్ కిషన్ టాలీవుడ్లో చాలా అవకాశాలే అందుకున్నాడు. 20కి పైగా సినిమాలు చేశాడు. కొన్నేళ్ల కిందటి వరకు అతడి పరిస్థితి బాగానే ఉంది కానీ.. ఈ మధ్య వరుసగా ఎదురు దెబ్బలు తగిలి కథానాయకుడిగా బాగా వెనుకబడిపోయాడు సందీప్. ఐతే తన కెరీర్లో రెండు మంచి అవకాశాలు మిస్సయిపోయానని.. అవి చేసి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని అంటున్నాడు సందీప్. ఆ సినిమాలు మరేవో కావు.. హ్యాపీడేస్.. అష్టాచెమ్మా. ఈ రెండు సినిమాలకూ సందీప్ ఆడిషన్స్ కు వెళ్లాడట.

తన టాలెంట్ కూడా చూపించాడట. కానీ అనివార్య కారణాల వల్ల తాను ఆ సినిమాలు చేయలేకపోయానని అతను చెప్పాడు. ‘హ్యాపీడేస్’ సినిమాలో నాలుగు పాత్రలకూ సందీప్ ను ట్రై చేసి చూశారట. చివరికి నిఖిల్ చేసిన రాజేష్ పాత్రకు సందీప్ ఓకే అయ్యాడట. కానీ ఆ పాత్రకు తెలంగాణ యాసలో డైలాగులు చెప్పాల్సి ఉండటంతో ఇబ్బంది వచ్చిందట. సందీప్ కు ఆ స్లాంగ్ రాకపోవడంతో అతడిని తప్పించాడట కమ్ముల. ఈ విషయంలో సందీప్ కు సారీ కూడా చెప్పాడట.

ఇక ‘అష్టాచెమ్మా’ విషయానికి వస్తే.. ఇంద్రగంటికి సందీప్ టాలెంట్ నచ్చినప్పటికీ అతడికి తగ్గ పాత్ర లేకపోవడంతో ఈ సినిమాకు తీసుకోలేదట. హీరో పాత్రకు సందీప్ సూటయ్యేట్లు ఉన్నప్పటికీ అప్పటికే నానిని సెలక్ట్ చేసి ఉండటంతో కుదర్లేదట. ఇక అవసరాల శ్రీనివాస్ పాత్రకు నువ్వు సూటవ్వవు అంటూ సందీప్ కు నో చెప్పాడట ఇంద్రగంటి. అలా ఆ రెండు సినిమాలూ తాను మిస్సయినట్లు అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Related posts:

పవన్ కళ్యాణ్ హిస్టారికల్ 23.84 రికార్డును బ్రేక్ చేసే హీరో ఎవరు ??
బాక్స్ ఆఫీస్ బాటిల్: మూడు రోజుల్లో ఏ సినిమా ఎంత వసూల్ చేసిందో తెలుసా??
స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...వరుసగా 4 వ సారి టాప్ లేపాడు
జస్ట్ 9 నిమిషాల్లో వరల్డ్ వైడ్ భీభత్సం..ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట...ఇండస్ట్రీ షాక్
150 కోట్ల కల కనిపిస్తున్న కుశ టీసర్...మీరేమంటారు చెప్పండి
ఇలాంటి సినిమా ఎన్టీఆర్ ఎలా వదులుకున్నాడు అసలు
#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు...ఫైనల్ ఎవరో??
టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ రేటుతో రామ్ చరణ్ కోసం సెట్
మరో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టేసిన ఎన్టీఆర్ జైలవకుశ
జైలవకుశ ప్రీమియర్ షో రివ్యూ...పులికేక పెట్టించిన యంగ్ టైగర్
తెలుగు సినిమా చరిత్రలో టాప్ 5[2 STATES] ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాలు ఇవే
బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్....ఇది
చరిత్రలో ఇది రెండో సారి....బాంబే వాల్వేట్ తర్వాత అజ్ఞాతవాసే
ఎన్టీఆర్ ప్లేస్ లో అల్లుఅర్జున్ కాదు...ఈ హీరోనే...తెలిస్తే షాక్ అవుతారు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here