సూర్య కి తెలుగులో “గ్యాంగ్” దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా

0
674

  కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ తానా సెరేంద్ర కూట్టం విడుదల అయింది. మూవీకి టాక్ బాగానే ఉండగా.. తెలుగులో గ్యాంగ్ పేరుతో వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే టాక్ కు తగినట్లుగా వసూళ్లు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గజిని మూవీ రిలీజ్ తర్వాత.. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఏర్పడింది. రజినీకాంత్ తర్వాత తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో సూర్యనే.

కానీ అంతకంతకూ సూర్య మార్కెట్ తగ్గిపోతూనే ఉంది. రీసెంట్ గా విడుదల అయిన గ్యాంగ్ కు తొలి రోజున వచ్చిన షేర్ వసూళ్లు పట్టుమని కోటి రూపాయలు కూడా లేకపోవడం ఆశ్యర్యం కలిగిస్తుంది. విజయ్.. ధనుష్.. విజయ్ యాంటోనీ.. శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ ను అంతకంతకు పెంచుకుంటున్న వైనం కనిపిస్తుంది.

కానీ సూర్యకు మాత్రం టాలీవుడ్ మార్కెట్ పతనం అవుతూనే ఉంది. ఇందుకు సూర్య పోషించే పాత్రలే కారణం అనే టాక్ ఉంది. మనవాళ్లు ప్రయోగాలను ఇష్టపడతారు కానీ.. మరీ హీరో నుంచి విలన్ వరకు.. తమ్ముడి రోల్స్ నుంచి తండ్రి పాత్రల వరకూ అన్నిటినీ పోషించేసి తెగ ఆశ్చర్యపరచాలని ప్రయత్నిస్తుంటాడు సూర్య. ఇలా చిత్రవిచిత్రమైన వేషాలతో ఉన్న మార్కెట్ ను పోగొట్టుకున్నాడని.. మనవాళ్లను ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here