తలైవా దెబ్బకి రికార్డులు గల్లంతు..25 కోట్లతో సరికొత్త రికార్డ్

  సౌత్ లో ఉన్న హీరోలలో తలైవా అని పిలుచుకునే హీరోలు ఇప్పుడు ముగ్గురున్నారు…రజినీకాంత్, విజయ్ మరియు ఎన్టీఆర్ లు అని చెప్పొచ్చు. కోలివుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కాగా తెలుగు సినిమాలకు శాటిలైట్ రైట్స్ పరంగా అద్బుతమైన ఆఫర్స్ తక్కువగానే వచ్చాయి కానీ కోలివుడ్ సినిమాలకు మాత్రం బాలీవుడ్ రేంజ్ లో ఆఫర్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం…

రజినీ సినిమాలకు 25 నుండి 30 కోట్లు ఆ పైన అవలీలగా వస్తుంటాయి. ఇక ఇప్పుడు విజయ్ నటిస్తున్న మెర్సల్ సినిమాకు కోలివుడ్ నాన్ రజినీ రేంజ్ బిజినెస్ జరిగింది…ఏకంగా 25 కోట్ల ఆఫర్ ఇచ్చి అక్కడి టాప్ చానెల్ విజయ్ టివి ఈ సినిమా రైట్స్ ని దక్కించుకుందట…

దాంతో తమ తలైవా సినిమాకి ఈ రేంజ్ ఆఫర్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయిందట అక్కడ. ఈ సినిమా ఈ దీపావళి కానుకగా తమిళ్ తో పాటు తెలుగు లోను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

Leave a Comment