తమిళ్ గడ్డపై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిందే..కాగా ఇంతకుముందు కన్నా భారీ రేట్లకి అమ్ముడుపోతున్న ఈ సినిమా ఆల్ టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాతో తమిళ్ లో కూడా అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్ కి షాక్ ఇస్తూ తమిళ్ లో డైరెక్ట్ తెలుగు వర్షన్ కే రికార్డు రేటు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది.

డైరెక్ట్ తెలుగు వర్షన్స్ లో ఎవ్వరికీ దక్కని విధంగా ఎన్టీఆర్ సినిమాకు ఏకంగా 2.24 కోట్ల రేటు ఆఫర్ వచ్చిందట…తమిళ్ లో ఎన్టీఆర్ మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా అక్కడ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా సెన్సార్ పనులతో పాటు అన్ని పనులను ముగించుకుని సెప్టెంబర్ 21 న ప్రేక్షకులముందుకు అత్యంత భారీ ఎత్తున్న ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Leave a Comment