తరుణ్ సినిమాకి అన్ని థియేటర్లా…దిమ్మతిరిగే షాక్ ఇది

0
2237

  దశాబ్దం కిందటే టాలీవుడ్లో తరుణ్ ప్రస్థానం దాదాపుగా ముగిసిపోయింది. ‘నువ్వే కావాలి’ లాంటి ఆల్ టైం మెగా హిట్ సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత ‘నువ్వు లేక నేను లేను’.. ‘ప్రియమైన నీకు’ లాంటి సూపర్ హిట్లు కొట్టి ఒక టైంలో పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన తరుణ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయాడు.  ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత అతను ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేశాడు. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యే మళ్లీ వార్తల్లోకి వచ్చింది.


ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల ముందు తరుణ్ ప్రకటిస్తే.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా నిజంగానే ఆ తేదీకి రిలీజవుతుందన్న నమ్మకాలు చాలామందికి కలగలేదు. ఐతే తరుణ్ మాత్రం తన పాటికి తాను సినిమాను ప్రమోట్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు నిజంగానే ప్రేమికుల దినోత్సవాన సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. 


ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని అమెరికాలో 60 లొకేషన్లలో రిలీజ్ చేయబోతున్నారట. ఒక రోజు ముందే అన్ని చోట్లా ప్రిమియర్లు కూడా వేస్తారట. తరుణ్ ఫాంలో ఉన్న సమయంలో అసలు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అన్నదే లేదు. ఇప్పటిదాకా తరుణ్ నటించిన ఏ సినిమా అమెరికాలో రిలీజవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.ఈ సినిమా తో తరుణ్ తిరిగ లైం లైట్ లోకి వస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here