NTR ర్యాంక్ 6…టాలీవుడ్ మొత్తం షాక్

1
5021

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల క్రేజ్ పవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే…2015 టెంపర్ నుండి తన క్రేజ్ ని రేంజ్ ని మరింత పెంచుకుని సినిమా సినిమా కి దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016 మరియు 2017 ఇయర్ లలో తన హవా పవర్ ఏంటో చూయించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇదే ఏడాది బుల్లి తెరపై కూడా బిగ్ బాస్ షో ద్వారా అడుగు పెట్టి దుమ్ము లేపాడు.

ఇలా అన్ని చోట్లా దుమ్ము లేపుతూ ఆల్ రౌండర్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన ఎన్టీఆర్ నటించిన బిగ్ బాస్ తెలుగు వర్షన్ టోటల్ వరల్డ్ లో 2017 లో ఓ రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… 2017 ఇయర్ లో టోటల్ వరల్డ్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాప్ 10 షోలలో ఒకటిగా నిలిచింది.

ఈ లిస్టులో గేం ఆఫ్ త్రోన్స్, డేస్టర్ లాంటి హాలివుడ్ షోలు ఉండటం విశేషం…బిగ్ బాస్ తెలుగు షో కి ఏకంగా 6వ ర్యాంక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది…ఇక 2018 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరిన్ని అద్బుతాలు సృష్టిస్తాడో చూడాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ అన్నీ బ్రేక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ 2018 లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here