[ఇది నా లవ్ స్టొరీ] ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

   ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఇది నా లవ్ స్టొరీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనని దక్కించుకోగా చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ మూవీస్ తో పాటు ఓల్డ్ మూవీస్ కూడా….

పోటి లో ఉన్న నేపధ్యంలో ఇది నా లవ్ స్టొరీ కి తరుణ్ ఓల్డ్ ఫ్యాన్స్ అలాగే ఇప్పుడు ఎలా చేశాడు అని క్యూరియాసిటీతో పాటు యూత్ కూడా థియేటర్ వైపు అడుగులు వేయగా సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా యావరేజ్ అనిపించుకుంది.

సినిమా సుమారు 150 థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ ని బట్టి మొదటి రోజు సినిమా యావరేజ్ గా 25 నుండి 30 లక్షల మధ్యలో షేర్ ని రాబట్టే చాన్స్ ఉందని అంటున్నారు. తరుణ్ పాత మూవీస్ అప్పట్లోనే 1 కోటి లెవల్ లో ఓపెన్ అయ్యేవి…అది కూడా టికెట్ రేటు 20, 25 ఉన్న కాలంలో…ఇప్పుడు 100-150 ఉన్న రోజుల్లో ఇంత తక్కువ ఓపెనింగ్స్ ని మాత్రమె సినిమా సాధించగలిగింది అని చెప్పొచ్చు.

Leave a Comment