ఇది ముమ్మాటికి నిర్మాతల తప్పే…టోటల్ టాలీవుడ్ షాక్!!

0
582

  తెలుగు సినిమా హిస్టరీలో ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్న దాని మీద ఆ సినిమా ఎ రేంజ్ లో హిట్ అనేది డిక్లేర్ చేసేవాళ్ళు. తర్వాత అది కలెక్షన్స్ కి మారగా ఇప్పుడు తక్కువ సమయంలో ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అది గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో అప్పుడప్పుడు కొన్ని సార్లు తప్పులు కూడా జరుగుతున్నా అది పెద్దగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను విషయంలో…

టాలీవుడ్ లో అల్టిమేట్ పాజిటివ్ రివ్యూ లు వచ్చినా కానీ సినిమా కలెక్షన్స్ పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. రెగ్యులర్ గా తెలుగు సినిమాల రోజు వారి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు ట్రేడ్ అనలిస్ట్ లు ట్విట్టర్ లో అప్ డేట్ చేయడం పరిపాటిగా మారింది.

కానీ భరత్ అనే నేను విషయంలో మాత్రం రిలీజ్ అయినా 25 రోజులు పూర్తీ అయినా కానీ సినిమా రోజు వారి కలెక్షన్స్ ని బయటికి చెప్పకుండా నిర్మాతలు కేవలం గ్రాస్ పోస్టర్స్ తో షాక్ ఇచ్చారు. ఆ లెక్కకు ట్రేడ్ లెక్కకు మధ్య అంతరం భారీ గా ఉండటంతో అసలు నిజం ఏంటో తెలియక ఇవి ఫేక్ కలెక్షన్స్ ఏమో అన్న భావన అందరిలోనూ కలుగుతున్నా నిర్మాతలు సినిమా కలెక్షన్స్ ని రివీల్ చేయకపోవడం మరింత విమర్శలకు దారి తీస్తుంది. మరి దీనికి పులిస్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here