తొలిప్రేమ మూడో రోజు కలెక్షన్స్…ఊచకోత!!

0
270

  వరుణ్ తేజ్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ రెగ్యులర్ ఫ్రై డే రిలీజ్ కాకుండా శనివారం రిలీజ్ అవ్వడంతో వీకెండ్ కేవలం 2 రోజులు మాత్రమె దక్కింది. అయినా కానీ రెండు రోజుల్లోనే 9 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న ఈ సినిమా వర్కింగ్ డే టెస్ట్ మండే ని ఎదుర్కోగా అద్బుతమైన రిజల్ట్ తో మండే టెస్ట్ ని పాస్ అయ్యింది సినిమా.

ట్రేడ్ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడో రోజు 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించినట్లు అంచనా. వర్కింగ్ డే లో మీడియం రేంజ్ హీరో కి ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఇక ఈ రోజు శివరాత్రి ఉండటం, రేపు వాలంటైన్స్ డే ఉండటం కూడా సినిమాకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. పోటిలో ఉన్న సినిమాలలో చలో మరియు తొలిప్రేమ లు మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్నాయి కాబట్టి ఈ రెండు రోజులు ఈ సినిమాలకు పండగే అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here