తొలిప్రేమ జెన్యూన్ రివ్యూ…SUPER HIT

0
493

        వరుణ్ తేజ్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లోటు తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలల్లో ఎంతో కొంత క్రేజ్ ఉన్న సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ సాధించే కెపాసిటీ ఉన్న సినిమాగా నిలిచిన ఈ సినిమా నిజంగానే అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం కచ్చితంగా అందుకుందనే చెప్పాలి.

లవ్ స్టొరీలలో కావాల్సిన ఫీల్ ఈ సినిమా ప్రతీ సీన్ సీన్ కి కనిపించడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొదటి అర్ధభాగం సినిమాకి వెన్నెముక అయితే రాశిఖన్నా మరియు వరుణ్ తేజ్ ల సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్…ఇక తమన్ అందించిన పాటలతో పాటు…

బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి అద్బుతంగా బ్యాక్ బోన్ లా నిలిచాయి. కథ సింపుల్ గానే ఉన్నా సినిమాలో ఉన్న ఫీల్…మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకు కొనసాగించి ఓ అద్బుతమైన లవ్ స్టొరీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ సినిమాకి ఉన్నాయి అనిపిస్తుంది.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా ఫస్టాఫ్ లో ఉన్నంత జోరు సెకెండ్ ఆఫ్ విషయంలో లేదనే చెప్పాలి. ఫస్టాఫ్ అద్బుతంగా అనిపిస్తే సెకెండ్ ఆఫ్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఆ ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ సెకెండ్ ఆఫ్ అయిపోయాక కూడా కనిపిస్తుంది.

అందుకే థియేటర్ నుండి బయటికి వచ్చినా కానీ తొలిప్రేమ సాంగ్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు లీడ్ క్యారెక్టర్స్ మనసును వెంటాడుతాయి. ఓవరాల్ గా సినిమా ఫిదా రేంజ్ లో ఉందా లేదా అనే టాక్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పుకుందాం.

ఫిదా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టొరీ…కానే తొలిప్రేమ పూర్తిగా లవ్ స్టొరీ…కానీ ఫీల్ మాత్రం రెండు సినిమాలలో ఈక్వల్ గా ఉంటుంది. ఫిదా ఫ్యామిలీస్ కి ఎక్కువ నచ్చితే తొలిప్రేమ యూత్ కి అద్బుతంగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫిదా రేంజ్ లో కాకున్నా ఆ ఫ్లో ని తట్టుకునే రేంజ్ లో తొలిప్రేమ ఉంటుంది.

దర్శకుడు కథ పెద్దగా చెప్పకున్నా తెరకెక్కించిన విధానం…దానికి వరుణ్ రాశి ల అద్బుత పెర్ఫార్మెన్స్ సినిమాను ఈజీగా ఒకసారి చూడొచ్చు అన్న నమ్మకం కలిగిస్తుంది. ప్రస్తుత వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీంటిలోకి తొలిప్రేమ ది బెస్ట్ అని చెప్పొచ్చు…

Related posts:

నితిన్ లై ఫస్ట్ డే కలెక్షన్స్...ట్రేడ్ కి షాక్ ఇచ్చిన నితిన్
ఫిదా బడ్జెట్, బిజినెస్-లాభం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
ఆగస్టు 1....ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం
చిరు-సుకుమార్ ల గొడవ...టోటల్ ఇండస్ట్రీ షాక్
బాహుబలి ఫస్ట్-ఫిదా 3rd...చరిత్రకెక్కిన ఫిదా కలెక్షన్స్
గుంటూరులో ఆల్ టైం టాప్ 3 నాన్ బాహుబలి మూవీస్ లో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్
ఒంటిచేత్తో 80 కోట్లు...ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది కాదు
26 వ తేదీ...మెగా ఫ్యాన్స్ కి అల్టిమేట్ న్యూస్
7 గంటలు 85 వేలు...పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా!!
నా సినిమా కాపీనే....అజ్ఞాతవాసి పై "లార్గో వించ్" డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
కొన్ని గంటల్లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే...!!!
ఈ పోటి ఏంటి సామి...ఏముంది ఆ రోజు అసలు!!
నా పేరు సూర్య కాపీ ఇష్యూ పై యూనిట్ షాకింగ్ కామెంట్స్
రంగస్థలం లేటెస్ట్ అప్ డేట్...అంతకుమించి!! రచ్చ ఖాయం!!
గరుడ వేగ డైరెక్టర్ తర్వాత సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here