ఈ దశాబ్దంలో ఎ సినిమా సాధించని రికార్డ్ కొట్టిన “తొలిప్రేమ”

0
328

  ఓల్డ్ క్లాసిక్స్ ను ఏ రకంగా టచ్ చేసినా కష్టమే. ఆ సినిమాల్ని రీమేక్ చేయాలని చూసినా.. లేదా ఆ టైటిళ్లను వాడుకోవాలని చూసినా ఎదురు దెబ్బ తప్పదు. ఇందుకు చరిత్రలో ఎన్నో రుజువులు కనిపిస్తాయి. ‘మాయాబజార్’.. ‘మరో చరిత్ర’.. ‘ఘర్షణ’.. ‘మౌనరాగం’.. ‘శంకరాభరణం’.. ఇలా పాత టైటిళ్లను వాడుకున్నపుడల్లా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఇంకా ఈ జాబితాలో చాలా సినమాలే కనిపిస్తాయి. ఐతే ‘మిస్సమ్మ’.. ‘మల్లీశ్వరి’ లాంటి ఒకట్రెండు సినిమాలు మాత్రం పాత టైటిళ్లను వాడుకుని విజయవంతమయ్యాయి.

అలనాటి చిత్రరాజాలతో ప్రేక్షకులకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల.. పాత టైటిళ్లను వాడుకోవడం వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయి లాగా నిలిచిపోయిన ‘తొలి ప్రేమ’ టైటిల్ ను వరుణ్ తేజ్ సినిమాకు పెట్టినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. పోయి పోయి ఆ టైటిల్ తో ఎందుకు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఈ టైటిల్ పెట్టడం వల్ల అంచనాలు పెరిగి.. సినిమా దానికి తగ్గట్లుగా లేకపోతే ప్రమాదమని హెచ్చరించారు.

అయినా చిత్ర బృందం వెనక్కి తగ్గలేదు. సినిమాకు ఇదే యాప్ట్ టైటిల్ అని వాళ్లనుకున్నారు. వాళ్ల నమ్మకమే నిలబడింది. ఈ టైటిల్ నే కాక సినిమాను కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. మంచి టాక్.. వసూళ్లతో సూపర్ హిట్టయ్యే దిశగా అడుగులేస్తోంది ‘తొలి ప్రేమ’. రెండు రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.25 కోట్ల షేర్ మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here