యంగ్ టైగర్ రికార్డ్ సేఫ్..మళ్ళీ టైగరే కొట్టాలి!!

0
1442

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఎప్పటి నుండో రికార్డ్ లెవల్ లో ఉంటాయి. సినిమా టాక్ కి అతీతంగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తాయి. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో రెండు ఏరియాల్లో ఎన్టీఆర్ రికార్డ్ అందుకోవడం ఇతర హీరోలకి అతి కష్టంగా మారింది అని చెప్పాలి. ఆ రెండు ఏరియాలు మరేవో కాదు నైజాం మరియు సీడెడ్ ఏరియాలు అని చెప్పొచ్చు.

ఈ రెండు ఏరియాల్లో ఒక్కో సినిమా ఒక్కో చారిత్రిక రికార్డ్ కొట్టాడు ఎన్టీఆర్. జనతాగ్యారేజ్ తో నైజాంలో 5.51 కోట్ల రికార్డును జైలవకుశ సినిమాతో సీడెడ్ లో 4.28 కోట్ల రికార్డ్ ను అందుకుని సంచలనం సృష్టించాడు. ఒకటి GST లేనప్పుడు కొడితే ఒకటి GST ఉన్నప్పుడు కొట్టాడు.

సక్సెస్ ట్రాక్ కూడా ఈ రికార్డులు కొట్టడానికి హెల్ప్ అయింది అని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఏవి ఈ రికార్డులను కొట్టలేదు. మిగిలిన ఏరియాలలో రికార్డులు బ్రేక్ అయినా ఈ రికార్డ్ ఇప్పటికీ ఎన్టీఆర్ పేరిటే ఉండటంతో మళ్ళీ టైగర్ దిగితేనే ఈ రికార్డులు బ్రేక్ అవుతాయోమో అని అంతా భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here