ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్…త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు!!

  దర్శకుడు త్రివిక్రమ్ లైన్లోకి వచ్చేసారు. అజ్ఞాతవాసి వైఫల్యం ఇచ్చిన వైరాగ్యాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు నిత్యం ఎన్టీఆర్ ఇంటికి త్రివిక్రమ్ వస్తున్నారు. ఇద్దరు సీరియస్ డిస్కషన్లు జరుపుతున్నారు. నిజానికి ఎన్టీఆర్ సినిమా కోసం మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. ఆ స్క్రిప్ట్ ను అలా పక్కన పెట్టేసి, ప్రతి సీన్, ప్రతి లైన్ మళ్లీ కొత్తగా రాయడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయిపోయినట్లు బోగట్టా. అందుకే తనకు మరి కొంత సమయం కావాలని తివిక్రమ్ కోరారు.

దాంతో ఫిబ్రవరి 14తరువాత షూట్ కు వెళ్లాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసి, మార్చి ఫస్ట్ వీక్ నుంచి షూట్ కు వెళ్లాలని డిసైడ్ చేసారు. సినిమాకు సంగీతం అనిరుధ్ నే అందిస్తారు. అందులో ఎలాంటి మార్పు లేదు. సినిమా సబ్జెక్ట్ కూడా మార్చలేదు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే. అందులో కూడా ఎలాంటి మార్పు లేదు.

ఎటొచ్చీ, అజ్ఞాతవాసి ఇచ్చిన అనుభవంతో, త్రివిక్రమ్ బాగా హర్ట్ అయ్యారని వినికిడి. అందుకే ప్రతి సీన్, ప్రతి డైలాగ్ మళ్లీ కొత్తగా ప్రెజెంట్ చేసి, కొత్తగా రాసే పనిలో పడ్డారు. అంతకు ముందుగా, సీన్ టు సీన్, టోటల్ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ తో గడచిన కొద్ది రోజులుగా డిస్కస్ చేస్తున్నారు. అందుకోసం నిత్యం ఎన్టీఆర్ ఇంటికి తివిక్రమ్ వస్తున్నారు.

Leave a Comment