పవన్ ని త్రివిక్రమ్ వెన్నుపోటు పోడిచాడా…ఏంటి సామి ఇది!!

0
381

  ఇన్నాళ్లు వెన్నుపోటు పొడిచేవాళ్లను చూశాం. కానీ అజ్ఞాతవాసి రాకతో పెన్నుపోటు అనే సరికొత్త పదం తెరపైకి వచ్చింది. అవును.. దర్శకుడు త్రివిక్రమ్, తన ప్రాణస్నేహితుడు పవన్ ను పెన్నుపోటు పొడిచాడు. కథ నుంచి స్క్రీన్ ప్లే వరకు ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటాడు పవన్. అది అతడి వర్కింగ్ స్టయిల్. అజ్ఞాతవాసి విషయంలో మాత్రం ఆ పని చేయలేదు పవన్. కారణం త్రివిక్రమ్. తనకు ఆత్మలాంటి త్రివిక్రమ్ కు పూర్తిస్వేచ్ఛ నిచ్చాడు పవన్.

కానీ త్రివిక్రమ్ మాత్రం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు. పవన్ లాంటి స్టార్ ను పెట్టి, భారీగా ఖర్చుపెట్టించి ఫైనల్ గా అభిమానులతో పాటు ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. నాసిరకమైన స్క్రిప్ట్, పాతకాలపు ఐడియాలతో సినిమాను ఫ్లాప్ చేశాడు. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లోనే త్రివిక్రమ్ చెప్పిన ఓ డైలాగ్ తో పవన్ ఫ్యాన్స్ కాస్త భయపడ్డారు.

సినిమా విడుదల తర్వాత పవన్ అభిమానుల భయం నిజమైంది. ఇంతకీ ఆ ఫంక్షన్ లో త్రివిక్రమ్ ఏమన్నాడంటే.. అజ్ఞాతవాసి కథను కేవలం 10నిమిషాలు మాత్రమే పవన్ కు వివరించాడట. అది కూడా ఫోన్ లో చెప్పాడట. ఆ 10నిమిషాల నెరేషన్ విని సినిమాకు ఓకే చెప్పాడట పవన్. అంటే.. ఆ తర్వాత ఇక స్క్రీన్ ప్లేలో పవన్ కలుగజేసుకోలేదన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here