రామ్ గోపాల్ వర్మ-నాగార్జున మూవీ ఫస్ట్ లుక్…అదిరింది

0
723

    కింగ్ నాగార్జున కెరీర్ లో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ పాత్ బ్రేకింగ్ మూవీ అయిన శివ వచ్చి 28 ఏళ్ళు కావొస్తుంది…శివ తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున ఒకటి రెండు సినిమాలు చేసినా అవేవి శివ లాంటి రిజల్ట్ ని ఇవ్వలేదు. కాగా ఈ సారి కొంత గ్యాప్ తీసుకుని ఇరువురు మరోసారి సినిమా చేయబోతున్నారు అనే వార్తా మళ్ళీ ఆసక్తిని రేపగా సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.

కాగా ఇందులో కింగ్ నాగార్జున లుక్ ఎలా ఉంటుందో రివీల్ చేసిన వర్మ…తన ఓల్డ్ ఫార్మాట్ లోనే మరోసారి సినిమాపై ఆసక్తి ని రేపాడు అని చెప్పొచ్చు. కింగ్ నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పిన వర్మ ఇప్పుడు ఈ సినిమా తో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట..కాగా త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని…ఈ సినిమా పెట్టె టైటిల్ నుండే అంచనాలు పీక్స్ లో పెరగడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here