కృష్ణుడి పై కామెంట్ చేసిన గోపాలుడు….రచ్చ రచ్చే ఇక

  టాలీవుడ్ లో అంతరించిపోతున్న మల్టీ స్టారర్ ట్రెండ్ కి తిరిగి ఊపిరి పోసిన హీరోలలో ముందు చెప్పుకోవాల్సిన పేరు విక్టరీ వెంకటేష్ ది అని చెప్పొచ్చు… సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మసాలా మరియు గోపాల గోపాల లాంటి సినిమాలతో తిరిగి మల్టీ స్టారర్ సినిమాలు తెలుగు లో మొదలు అయ్యేలా చేసిన ఈగో లెస్ స్టార్ విక్టరీ వెంకటేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేశం అందరికీ తెలిసిందే…

ఆ స్నేహం వల్లే పవన్ కోరిక మేరకు త్రివిక్రమ్ పవన్ ల కాంబో లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి లో స్పెషల్ క్యామియో కూడా చేసి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేస్తున్న పవన్ సెన్సేషనల్ అజ్ఞాతవాసి టీసర్ చూసి స్టన్ అయ్యాడట విక్టరీ వెంకటేష్…

ఎన్ని లీలలు చూపుతావు కృష్ణా…మరో కొత్త లీల…. సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.. సెలెబ్రిటీల ప్రశంసలు దక్కించు కుంటున్న అజ్ఞాతవాసి టీసర్ ట్రైలర్ లాంచ్ తర్వాత మరెంత రచ్చ చేస్తుందో చూడాలి.

Leave a Comment