టోటల్ సౌత్ ఇండస్ట్రీ షాక్…చిరు 164…విజయ్ 217…భీభత్సం ఇది

2017 ఇయర్ మరో 2 నెలల్లో ముగియనుంది….కాగా ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీ లో రిలీజ్ అయిన సినిమాల్లో బాహుబలి 2 టోటల్ ఇండియాలోనే నంబర్ 1 గా నిలిచి సంచలనం సృష్టించగా రెండో ప్లేస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా మమ్మోత్ కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్ 150 టాప్ 2 ప్లేస్ లో ఇన్నాళ్ళు కొనసాగి మెగా కంబ్యాక్ పవర్ ఏంటో తెలియజేసింది. కాగా ఇన్ని రోజులు టాప్ 2 లో ఉన్న చిరు సినిమాకి బ్రేక్ వేశాడు విజయ్.

కోలివుడ్ ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ తమిళనాట ఆల్ టైం హిస్టారికల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించి ఏకంగా సౌత్ లో బాహుబలి తర్వాత స్థానాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఖైదీనంబర్ 150 టోటల్ రన్ లో 164 కోట్ల గ్రాస్ ని అందుకుంది….

కాగా ఇప్పుడు మెర్సల్ ఇప్పటికే 217 కోట్ల గ్రాస్ తో భీభత్సానికి పరాకాష్టగా నిలిచి సంచలనం సృష్టిస్తూ టాప్ 2 ప్లేస్ లో అల్టిమేట్ రికార్డును నమోదు చేసింది. ఈ జోరు చూస్తుంటే సినిమా టోటల్ రన్ లో మరిన్ని భీభత్సమైన రికార్డులు నమోదు చేసే చాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment