బడ్జెట్ 100 కోట్లు…బిజినెస్ 120 కోట్లు…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే??

0
915

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే…. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా ఆ అంచనాలను అందుకుని దీపావళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి భీభత్సం సృష్టించింది. కాగా సినిమా మొత్తం మీద సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఇక బిజినెస్ కూడా అదిరిపోయే లెవల్ లో జరిగింది.

ఓవరాల్ గా 120 కోట్లకు పైగా బిజినెస్ సాధించిన ఈ సినిమా టోటల్ రన్ లో 121 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కాగా సినిమా టోటల్ రన్ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ కోలివుడ్ ట్రేడ్ లెక్కల ప్రకారం 254 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది.

కాగా అందులో మొత్తం మీద షేర్ 136 కోట్లవరకు ఉండటం సినిమా సాధించిన భీభత్సానికి పరాకాష్ట. ఈ రేంజ్ వసూళ్ళతో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్స్ సౌత్ మొత్తం మీద రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్ టైం టాప్ 5 లో ఒకటిగా ఉండటం నిజంగా భీభత్సం అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here