విజయ్ రోల్ లో ఎన్టీఆర్…ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది!!

కోలివుడ్ తలైవా గా పేరు తెచ్చుకున్న ఇలయ ధలపతి విజయ్ టాలీవుడ్ తలైవా గా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఇద్దరు హీరోలు నటించిన సినిమాల్లో మూడు మూడు పాత్రలతో రఫ్ ఆడించారు ఇద్దరు. కాగా ఎన్టీఆర్ సినిమాలు రీమేక్ లు చేయడానికి ఎవ్వరూ సాహసించరు కానీ విజయ్ సినిమాలు తెలుగు లో తరచుగా రీమేక్ అవ్వడం సూపర్ విజయాలు సాధించడం కామన్.

కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ మెర్సల్ సినిమా ని రీమేక్ చేయాలని అనుకుని చివరి నిమిషంలో ప్రయత్నాన్ని ఆపేశారు. దానికి కారణం విజయ్ గెటప్స్ అని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో విజయ్ ఒదిగిన తీరు ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో విజయ్ లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు.

కానీ ఆ లుక్ ని రిప్లేస్ చేయలేమని వదిలేయగా ఎన్టీఆర్ అభిమానులు కొద్దిగా మార్పులు చేసి ఎన్టీఆర్ లుక్ ని విజయ్ లుక్ లో మార్చి అబ్బురపరిచారు. దాంతో అందరూ ఈ సినిమా ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటుండటం విశేషం అని చెప్పొచ్చు.

Leave a Comment