ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ చేస్తున్న న్యూస్…మే 12….???

0
745

  నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడూ సంచలన కాంబినేషన్లతో ఆశ్చర్యపరుస్తుంటాడు. గత కొన్నేళ్లలో ఆయన దాసరి నారాయణరావు.. రవికుమార్ చావలి.. క్రిష్.. కె.ఎస్.రవికుమార్ లాంటి దర్శకులతో జత కట్టి షాకిచ్చాడు. బాలయ్య వీళ్లతో సినిమాలు చేస్తాడని ఎవ్వరూ ఊహిచంలేదు. వీళ్లలో క్రిష్ శైలికి బాలయ్య స్టైల్కు అస్సలు మ్యాచ్ కాకపోవడం ఆశ్చర్యానికి కారణం కాగా.. మిగతా ముగ్గురూ అసలేమాత్రం ఫాంలో లేకపోయినా బాలయ్య వాళ్లతో సినిమా చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు బాలయ్య మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.

‘ఇంటిలిజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన వి.వి.వినాయక్ దర్శకత్వంలో నటించడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. బాలయ్య-వినాయక్ కాంబినేషన్లో సినిమా చేయనున్నట్లు సి.కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మా అన్నప్పటికీ జనాలకు నమ్మకం కలగలేదు. కానీ వినాయక్ సన్నిహితుల సమాచారం ప్రకారం నిజంగానే ఈ సినిమా ఉంటుందట.

మే 12న ఈ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా చేయాలని ఫిక్సయ్యారు. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి ఇంకా కథ ఏమీ సెట్టవ్వలేదట. ఐతే బాలయ్య ప్రస్తుతం తేజతో ‘ఎన్టీఆర్’ సినిమా చేస్తున్నాడు. దాన్నుంచి బయటికి రావడానికి ఆరేడు నెలలు పడుతుంది. ఈ లోపు వినాయక్ తన రైటర్స్ టీంతో కలిసి కథ రెడీ చేసుకుంటాడన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here