ఈ కలెక్షన్స్ పై ఇంత తొందరెందుకు సామి!!

0
624

  పోయినేడాది ‘దువ్వాడ జగన్నాథం’ వసూళ్ల విషయంలో ఎంత రగడ జరిగిందో తెలిసిందే. డివైడ్ టాక్ తో మొదలైన ఆ సినిమా నాలుగు తిరక్కుండానే వంద కోట్ల వసూళ్లు సాధించిందంటే నమ్మశక్యంగా అనిపించలేదు. దిల్ రాజు లాంటి క్రెడిబిలిటీ ఉన్న నిర్మాత ఇలాంటి ప్రచారం దిగడమేంటన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐతే దానిపై రాజు వివరణ ఇచ్చుకున్నాడు. ఒక దశ దాటాక ఆ సినిమా నష్టాలు మిగిల్చిన విషయాన్ని కూడా అంగీకరించాడు. ఐతే ‘డీజే’కు డివైడ్ టాక్ ఉంది కాబట్టి అలాంటి ప్రచారాలు చేసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తో మొదలై మంచి వసూళ్లు సాధిస్తున్న ‘భరత్ అనే నేను’ విషయంలోనూ ఇలాంటి ప్రచారాలే జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర బృందం పోస్టర్లు వేసేసింది. నిజానికి వీకెండ్ అయ్యాకే ఈ చిత్రం 100 కోట్ల మార్కును అందుకున్నట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

ఇక యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘భరత్ అనే నేను’ ప్రిమియర్లతోనే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. శుక్రవారానికి 2.5 మిలియన్ల మార్కును అందుకున్నట్లుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కానీ అదీ అబద్ధమే. వీకెండ్ అయ్యాక.. సోమవారానికి కానీ ఈ చిత్రం ఆ మార్కును టచ్ చేయలేదు. మంచి సక్సెస్ అందుకున్న టైంలో ఇలాంటి ప్రచారాలెందుకున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here