భరత్ అనే నేను కలెక్షన్స్ ఎందుకు బయటికి రావడం లేదు??

0
1451

     భరత్ అనే నేను తొలి రోజు అంకెలు బయటకు వచ్చాయి. అంతే ఆ మర్నాటి నుంచి ఎక్కడి అంకెలు అక్కడ గప్ చుప్. దీని వెనుక కొరటాల శివ వ్యూహం వుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భరత్ అనే నేను సినిమా అమ్మకాలు అన్నీ ఆయనే పర్యవేక్షించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలను కొరటాల సన్నిహితుడు, ఆయన తరువాత సినిమా నిర్మాత సుధాకర్ తీసుకున్నారు. అలాగే ఈస్ట్ ను మరో సన్నిహితుడు భరత్ చౌదరి తీసుకున్నారు.

నైజాం ఏరియా కొరటాల ఖాతాలో దిల్ రాజు దగ్గర వుంది. మిగిలినవి వెస్ట్, ఉత్తరాంధ్ర, నెల్లూరు. సీడెడ్. తొలి రోజు ఫలితాలు బయటకు రాగానే దిల్ రాజుకు హుకుం జారీ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిగర్స్ బయటకు వెళ్లడానికి వీల్లేదని. దాంతో అక్కడ తాళం పడిపోయింది.

గుంటూరు, కృష్ణ అంకెలు సీడెడ్ ను మించిపోయాయని, ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కొరటాల కోసం ఆయన సన్నిహితుడు సుధాకర్ హస్తం వుందని టాక్. ఏమైతేనేం ఇప్పుడు ఒక్క ఓవర్ సీస్ మినహా ఎక్కడా ఒక్క కలెక్షన్ ఫిగర్ కూడా బయటకు రానివ్వడం లేదు.

ఫ్యాన్స్ ను కూడ ఎక్కడా ఫిగర్లు షేర్ చేయవద్దని ఆదేశాలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దాంతో సోషల్ నెట్ వర్క్ లో కూడా కేవలం పట్టణాల వారీగా, చిన్న చిన్న వివరాలు మినహా మరే విదమైన కలెక్షన్ ఫిగర్లు కనిపించడం మానేసాయి.

కేవలం రెండో రోజు వంద కోట్ల గ్రాస్ అన్నది తప్ప, మరో మాట బయటకు రాలేదు. ఫస్ట్ వీక్ కాగానే పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు చూపించడమే కొరటాల టీమ్ లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే నాన్ బాహుబలి రికార్డులు, రంగస్థలాన్ని దాటిన రికార్డులు సృష్టించేసినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీలో కామెంట్ లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here