అల్లు శిరీష్ “యుద్దభూమి” తెలుగు రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

రెండు హిట్ లు ఖాతాలో వున్న హీరోగా అల్లుశిరీష్ గురించి అతగాడి సన్నిహితులు చెప్పుకుంటారు. ఇక మోహన్ లాల్ అంటే మన సినిమా అభిమానులు అందరికీ పరిచయమే. అలాంటి ఇద్దరి కాంబినేషన్ లో మళయాలంలో భారీగా తయారై, విడుదలై, ఏవరేజ్ అయిన సినిమా యుద్ధభూమి. మోహన్ లాల్ సినిమా మాలీవుడ్ లో ఏవరేజ్ అంటే ఫ్లాప్ కిందే లెక్క.  ఆ సినిమా తెలుగులోకి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ వచ్చారు ఇన్నాళ్లు. కానీ రాలేదు.

Allu Shirish Yudda Bhoomi Telugu Business

ఇప్పుడు మళ్లీ కాస్త గ్యాప్ తరువాత డేట్ చెప్పకుండానే హడావుడి స్టార్ట్ చేసారు. బడా నిర్మాత ఎన్వీప్రసాద్ ఆరంభంలో ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. మరి ఏమయిందో? ఎవరికో ఇచ్చేసారు. ఇన్ని చేతులు మారినా ఈ సినిమా వాల్యూ జస్ట్ కోటిరూపాయిల లోపుమాటే అని వినికిడి.

కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా, తెలుగు హీరో వున్న సినిమా డబ్బింగ్ రేటు మరీ ఇంత చీప్ ఏమిటో? అక్కడ సినిమా ఏవరేజ్ కావడం వల్లనా? లేక సినిమాలో విషయం కూడా ఆ రేంజ్ లోనే వుంటుందా? ఏమో?

Allu Shirish Yudda Bhoomi Telugu Business

Leave a Comment