అంత పవర్ ఫుల్ లుక్ కి ఈ ట్రోలింగ్ ఏంటి సామి!! | 123Josh.com
Home గుసగుసలు అంత పవర్ ఫుల్ లుక్ కి ఈ ట్రోలింగ్ ఏంటి సామి!!

అంత పవర్ ఫుల్ లుక్ కి ఈ ట్రోలింగ్ ఏంటి సామి!!

0
1085

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తయిపోయింది. దసరా సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు ఆర్మీ డ్రెస్ లో ఉండగా తాజాగా రిలీజ్ చేసిన పిక్ లో కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర కత్తి పట్టుకుని తీక్షణంగా చూస్తున్నాడు. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన పిక్ మీద సోషల్ మీడియాలో మహేష్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు.

భరత్ అనే నేను – మహర్షి సినిమా స్టిల్స్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పోస్టర్ ని పోలుస్తున్నారు. ప్రతి మూవీలో మహేష్ ఇదే స్టిల్ ఉంటుందని – కేవలం అతని కాళ్ళ మధ్య దూరం మాత్రం పెరుగుతుందని అంతకుమించి ఆ పోస్టర్ లో కొత్తదనం కనపట్లేదని అంటున్నారు. ఇలాంటి స్టిల్స్ మహేష్ గత చిత్రాల్లో చాలా ఉన్నాయని గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

తెలుగులో హీరోలందరూ తమ సినిమాల కోసం తమ శరీరాలను తామే హింసించుకుంటున్నారు. క్యారక్టర్ కి తగ్గట్టు బరువు తగ్గడం – పెరగడం లాంటివి చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి హెల్త్ ప్రొబ్లెమ్స్ వచ్చినా తమ వాళ్ళు లెక్క చెయ్యట్లేదు. కానీ మహేష్ బాబు మాత్రం ప్రతి సినిమాకి డ్రెస్ లు మాత్రమే మారుస్తున్నారని – మిగిలిన అన్నీ ఒకేలా ఉంటున్నాయని ట్రోల్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here