అంత పోటి లో కెరీర్ బెస్ట్ ఏంటి సామి…గట్టిగా కొట్టాలి ఇక!! | 123Josh.com
Home న్యూస్ అంత పోటి లో కెరీర్ బెస్ట్ ఏంటి సామి…గట్టిగా కొట్టాలి ఇక!!

అంత పోటి లో కెరీర్ బెస్ట్ ఏంటి సామి…గట్టిగా కొట్టాలి ఇక!!

0
4316

సంక్రాంతి పందెంలో నాలుగు సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న రజనీ దర్బార్ .. జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. జనవరి 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల పేరుతో దాదాపు 300 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తోంది.

ఆ క్రమంలోనే ఏ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా అల వైకుంఠపురములో ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు అందాయి.  ఫిలిం పంపిణీదారుల సమాచారం ప్రకారం.. నైజాం – 20.00 కోట్లు.. సీడెడ్ – 12.06 కోట్లు.. నెల్లూరు – 2.80 కోట్లు.. కృష్ణా – 5.00 కోట్లు.. గుంటూరు – 6.30 కోట్లు.. వైజాగ్ – 8.50 కోట్లు.. ఈస్ట్ – 6.30 కోట్లు..వెస్ట్ – 5.00 కోట్లు.. ప్రీబిజినెస్ జరిగింది.

  టోటల్ ఏపీ+తెలంగాణ – 65.96 కోట్ల మేర బిజినెస్ చేశారు. కర్ణాటక – 7.20 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు.. ఓవర్సీస్ – 9.80 కోట్లు.. టోటల్ వరల్డ్వైడ్ – 84.46 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది. దాదాపు 85 కోట్ల మేర బిజినెస్ చేసింది కాబట్టి ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here