అక్కడి ఆడియన్స్ గట్టి దేబ్బెశారు గా! | 123Josh.com
Home గుసగుసలు అక్కడి ఆడియన్స్ గట్టి దేబ్బెశారు గా!

అక్కడి ఆడియన్స్ గట్టి దేబ్బెశారు గా!

0
374

‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు అమెరికాలో స్పందన నిరాశాజనకంగా ఉంది. సినిమాకు రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం కనిపించింది. పబ్లిసిటీ కూడా తక్కువగా ఉండడంతో డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్స్ కు 143 లొకేషన్స్ నుంచి వచ్చిన కలెక్షన్స్ $111K మాత్రమే. మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం పని చేయలేదని అంటున్నారు. సినిమా టీజర్.. ట్రైలర్లలోనే ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపించడంతో సినిమాపై పెద్దగా బజ్ రాలేదు.

ఇక ఓవర్సీస్ లో పబ్లిసిటీ సరిగా చేయక పోవడం కూడా సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ మెరుగయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. విజయ్ దేవరకొండ తన ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే భవిష్యత్తు లో ఇంకొన్ని ఎదురుదెబ్బలు తప్పవని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here