అమెజాన్ ప్రైమ్ లో సాహో రిలీజ్ ఎప్పుడో తెలుసా?? | 123Josh.com
Home న్యూస్ అమెజాన్ ప్రైమ్ లో సాహో రిలీజ్ ఎప్పుడో తెలుసా??

అమెజాన్ ప్రైమ్ లో సాహో రిలీజ్ ఎప్పుడో తెలుసా??

0
2768

సాహో సినిమా విడుదలై 40 రోజులు అవుతుంది. తెలుగులో అంత ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా హిందీలో దుమ్ము దులిపింది. అక్కడ ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలు తీసుకున్నారు. తెలుగు మరియు మిగిలిన భాషల్లో ఈ సినిమా చాలావరకు నష్టాలనే మిగిల్చింది. అయితే చాలామంది ఈ సినిమాను థియేటర్ లో చూడడం మిస్ అయ్యారు. సాహో కి నెగటివ్ టాక్ రావడం –

హాలిడేస్ ఎక్కువ లేకపోవడంతో కొంతమంది ఈ సినిమా చూడలేదు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో చూడని వాళ్లకి ఒక గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజున ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయినపుడు చాలామంది ఒక్కసారి చూస్తే సినిమా అర్థంకావట్లేదని రెండోసారి చూస్తే సినిమాలో ఉన్న దమ్ము తెలుస్తుందని అన్నారు.

ఇప్పుడు థియేటర్ లో ఒక్కసారి చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రైమ్ లో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం థియేటర్ లో చూసిన వాళ్ళు – చూడని వాళ్ళు కూడా అక్టోబర్ 23 కోసం చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు – తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతుంది. హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here