అల్లు అర్జున్ న్యూ పాన్ ఇండియా సెన్సేషన్!! | 123Josh.com
Home గుసగుసలు అల్లు అర్జున్ న్యూ పాన్ ఇండియా సెన్సేషన్!!

అల్లు అర్జున్ న్యూ పాన్ ఇండియా సెన్సేషన్!!

0
6825

స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు టాలీవుడ్ మాలీవుడ్ ల మీద ఫోకస్ పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

కాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇకపై అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కెరీర్లో 21వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యూనివర్సల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ మరియు గీతాఆర్ట్స్ 2 అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తం మీద బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పుష్ప’ రిలీజ్ అయితే కానీ అతని ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చెప్పలేము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here