అల వైకుంఠ పురంలో రికార్డులు ఆగట్లేదు..నెట్ ఫ్లిక్స్ వాళ్ళు కొత్త రికార్డ్ చెప్పారు!

0
5121

థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఓటీటీలో విడుదల అయినా కూడా అత్యధికంగా వ్యూస్ ను దక్కించుకుంది అంటూ నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. అల్లు అర్జున్.. పూజా హెగ్డే జంటగా రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ జాబితాలో నెం.2గా దుల్కర్ సల్మాన్ మరియు రీతూ వర్మ నటించిన కనులు కనులను దోచాయంటే సినిమా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి వ్యూస్ ను రాబట్టింది.

ఇక మూడవ స్థానంలో కప్పెల అనే మలయాళ సినిమా నిలిచింది. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లో మన సినిమా దద్దరిల్లినందుకు అభిమానులు మళ్లీ వేడుక చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here