అశేష అభిమానుల సమక్షంలో…సెన్సేషనల్ న్యూస్!! | 123Josh.com
Home గుసగుసలు అశేష అభిమానుల సమక్షంలో…సెన్సేషనల్ న్యూస్!!

అశేష అభిమానుల సమక్షంలో…సెన్సేషనల్ న్యూస్!!

0
907

ఇటీవలి కాలంలో స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్లు.. ప్రీరిలీజ్ వేడుకలు అంటే భారీగా అభిమాన బలగం దిగిపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న `సాహో` ప్రీరిలీజ్ కోసం డార్లింగ్ ప్రభాస్ అభిమానులు.. సైరా ప్రీఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీగా వచ్చారు. వేలాదిగా వచ్చిన అభిమానులతో స్టేడియమ్ లు కిక్కిరిపోయాయి.

పాన్ ఇండియా అంటూ ఆ ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. ప్రస్తుతం మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `రూలర్` ఈవెంట్ కి టైమ్ దగ్గర పడింది. ఇప్పటికే చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. పెండింగ్ చిత్రీకరణలతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులు సైమల్టేనియస్ గా పూర్తవుతున్నాయి.

డిసెంబర్ 20న సినిమా రిలీజవుతుందని తేదీని ప్రకటించేయడం తో ఇక పెండింగ్ బ్యాలెన్స్ అన్ని పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. రిలీజ్ కి సరిగ్గా మరో పాతిక రోజుల సమయం కూడా లేదు. అందుకే ఈ సినిమా ప్రచారాన్ని హీటెక్కించే ఆలోచన లో బాలపాటి బృందం ఉన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here