ఆల్ రెడీ ఒక హిట్ కొట్టాడు…ఇది కూడా పక్కా!! | 123Josh.com
Home న్యూస్ ఆల్ రెడీ ఒక హిట్ కొట్టాడు…ఇది కూడా పక్కా!!

ఆల్ రెడీ ఒక హిట్ కొట్టాడు…ఇది కూడా పక్కా!!

0
529

సాయి తేజ్- మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ప్రతి రోజు పండగే’ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కి ఇంకా రెండు నెలలే ఉన్నా ఇంత వరకూ రిలీజ్ డేట్ ప్రకటించని మేకర్స్ ఎట్టకేలకు విడుదల తేదీ ను ప్రకటించారు.

డిసెంబర్ 20న సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది అప్పటి నుండి సెలెబ్రెట్ చేసుకుందాం అంటూ రిలీజ్ డేట్ తో పోస్టర్ వదిలారు. ఇదే పోస్టర్ లో గ్లిమ్స్ రెస్పాన్స్ కి థాంక్స్ చెప్పారు మేకర్స్. తాత మనవడి జర్నీ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

నవంబర్ ఎండింగ్ వరకూ జరగనున్న చివరి షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here