ఆ టాక్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి సామి!! | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ ఆ టాక్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

ఆ టాక్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

0
4500

వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ రెండు వారాల వసూళ్ల రిపోర్ట్ ఎలా ఉంది? ఇంతకీ పంపిణీ వర్గాలకు లాభమా నష్టమా? అంటే ఇవిగో ఇవే వివరాలు. వాల్మీకి చిత్రం 14వ రోజు పూర్తయ్యే సరికి తెలంగాణ- ఆంధ్రాలో రూ.21 కోట్ల మార్కును.. ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మార్కును అధిగమించింది. గత పద్నాలుగు రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే..

మొత్తంగా వాల్మీకి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.37.65 కోట్ల గ్రాస్ ను రూ.24.01 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.24.25 కోట్ల మేర బిజినెస్ చేశారు. అయితే 25 కోట్ల రిటర్న్ ఛాలెంజ్ తో బరిలోకి దిగిన గద్దలకొండ గణేష్ లాభాల్లోకి రావాలంటే.. మరో కోటి మాత్రమే వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వాల్మీకి వసూళ్లను పరిశీలిస్తే.. నైజాం-7.76 కోట్లు.. సీడెడె- 3.41 కోట్లు.. తూర్పు గోదావరి -1.67 కోట్లు.. పశ్చిమ గోదావరి-1.40 కోట్లు.. గుంటూరు-1.8 కోట్లు.. కృష్ణా -1.4 కోట్లు.. నెల్లూరు- 82 లక్షలు వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర చోట్ల వసూళ్లు కలుపుకుంటే ఓవరాల్ గా 24కోట్లు వసూలైంది. కోటి మాత్రం డెఫిసిట్ ఇప్పటికి అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here