ఆ ప్రొడ్యూసర్ తో మరో కొత్త సినిమా కమిట్ అయిన మెగా పవర్ స్టార్!! | 123Josh.com
Home న్యూస్ ఆ ప్రొడ్యూసర్ తో మరో కొత్త సినిమా కమిట్ అయిన మెగా పవర్ స్టార్!!

ఆ ప్రొడ్యూసర్ తో మరో కొత్త సినిమా కమిట్ అయిన మెగా పవర్ స్టార్!!

0
720

రామ్ చరణ్ -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో నష్టాలు చూడాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాను దానయ్య బ్యానర్లో చేసేందుకు చరణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇదంతా చూస్తుంటే ‘వినయ విధేయ రామ’ లాస్ ను దానయ్య ఏదో ఒక రూపంలో కవర్ చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు మాస్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. చరణ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి దానయ్య చేతిలో మంచి ప్రాజెక్టు ఉన్నట్టే. ‘RRR’ సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here