ఆ మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో వీరిద్దేరా ఇక?? | 123Josh.com
Home గుసగుసలు ఆ మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో వీరిద్దేరా ఇక??

ఆ మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో వీరిద్దేరా ఇక??

0
1104

తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ మల్టీ స్టారర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది మలయాళంలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియం”. ఈ సినిమాలో బిజూ మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా అంత ఇద్దరు వ్యక్తుల ఇగోల పై నడుస్తుంది. ఒక రిటైర్డ్ హవాల్దారుకి ఒక పోలీస్ ఆఫీసర్ కి మధ్య చెలరేగిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. అంతటి బలమైన పాత్ర చిత్రణతో తెరకెక్కించారు డైరెక్టర్ సాచి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నించిన విషయం తెలిసిందే. చివరిగా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హవాల్దారు పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. ఇక మరో కీలక బిజూ మీనన్ పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ముందుకు రాకపోవటంతో ఆ పాత్రకోసం విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక ఈ సినిమా చేయడానికి  విక్టరీ వెంకీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here