ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం ఖాయమంటున్న మహేష్!! | 123Josh.com
Home న్యూస్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం ఖాయమంటున్న మహేష్!!

ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం ఖాయమంటున్న మహేష్!!

0
2281

టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ అప్పుడప్పుడూ ఫాన్స్ ని టెన్షన్ పెడుతుంటాయి. ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. నిజానికి కొన్ని సందర్భాల్లో అవి కూడా నిజమే అనే పరిస్థితి. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చుట్టూ ఇలాంటి ఓ సెంటిమెంట్ తిరుగుతుంది. అదే మిలటరీ బ్యాక్ డ్రాప్. సినిమాలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ గా కనిపోయించనున్నాడు.

మహేష్ కి ఈ బ్యాక్ డ్రాప్ సినిమా ఎంచుకోవడం ఇదే మొదటి సారి.నిజానికి సుమంత్ నటించిన ‘యువకుడు’ నుండి లేటెస్ట్ గా అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ వరకూ ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ అనుకున్న రీచ్ కి వెళ్లలేక చతికిల పడ్డాయి. అందుకే ఇప్పుడు మహేష్ సినిమాపై ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.

నిన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ వదిలారు. టైటిల్ లోగోతోనే సినిమా కథాంశం చెప్పేసింది మేకర్స్ మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేస్తున్నారు. అయితే ఈసారి మహేష్ ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here