ఇండస్ట్రీ హిట్ రీమేక్…హీరో ఎవరు?? | 123Josh.com
Home గుసగుసలు ఇండస్ట్రీ హిట్ రీమేక్…హీరో ఎవరు??

ఇండస్ట్రీ హిట్ రీమేక్…హీరో ఎవరు??

0
499

సంక్రాంతి బరిలో క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `అల వైకుంఠపురములో` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బాస్ అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే హిందీ రీమేక్ లో కథానాయకుడు ఎవరు? దర్శకుడెవరు? అన్నది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.

అక్కడ ఎవరు నటిస్తే బావుంటుంది? అన్నదానిపై ప్రస్తుతం ఆలోచన సాగుతోందట. అల్లు అరవింద్ బాలీవుడ్ లోనూ ఫేమస్ నిర్మాత. అక్కడ తొలి 100 కోట్ల క్లబ్ సినిమాని తెరకెక్కించింది అరవింద్. `గజినీ` రీమేక్ ని అదే టైటిల్ తో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు.

అమీర్ ఖాన్ సహా బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ ఆయన కు సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమంలోనే అల వైకుంఠపురము లో హిందీ రీమేక్ కి ఏ స్టార్ ఓకే చెబుతారు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ ని దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here