ఇక్కడే కాదు అక్కడ కూడా తేడా కొంచమే!! | 123Josh.com
Home న్యూస్ ఇక్కడే కాదు అక్కడ కూడా తేడా కొంచమే!!

ఇక్కడే కాదు అక్కడ కూడా తేడా కొంచమే!!

0
1561

సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు….స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో  చిత్రాలు ప్రీమియర్ వసూళ్లు అదిరిపోయారు. మహేష్ బన్నీ అంచనాలను మించి ఓపెనింగ్ లు సాధించారు. ఇద్దరు ఒక్క రోజు ముందుగానే ఓవర్సీస్ బాక్సాఫీస్ ను షేక్ ఆడించేసారు.

తాజాగా స్టిల్ అదే దూకుడు నేటికి కొనసాగుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు మంగళవారం సాయంత్రానికి 200  లోకేషన్స్ లో  $91700 డాలర్లు సాధించింది. గ్రాస్ లెక్క $1.77 మిలియన్ డాల్లగా ఉంది. ఈ వారంతానికి $2మిలియన్ డాలర్లతో న్యూ వేవ్ ని క్రియేట్  చేయనుందని  ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక అల వైకుంఠపురములో సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది. మంగళవారం సాయంత్రానికి 122 లోకేషన్ల నుంచి $170200 డాలర్లు సాధించింది. గ్రాస్  $1.74మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించింది. దీంలో అల బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. ఈ వారంలోపే  $2మిలియన్ల మైల్ స్టోన్  సాధించడం ఖాయమనే ట్రేడ్  అంచనా వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here