ఇక అదే టైటిల్ ఫిక్స్ అయినట్లేనా?? | 123Josh.com
Home గుసగుసలు ఇక అదే టైటిల్ ఫిక్స్ అయినట్లేనా??

ఇక అదే టైటిల్ ఫిక్స్ అయినట్లేనా??

0
1060

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ సెట్స్ మీద ఉండగానే తారక్ ఈ సినిమా ఓకే చేసాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసిందట. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఫైనలైజ్ చేశారట.

వాస్తవానికి ఈ టైటిల్ ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. కాకపోతే వర్కింగ్ టైటిల్ అయ్యుండొచ్చు అని అనుకున్నారు. అయితే ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘అ’ అక్షరం సెంటిమెంటుగా వస్తుండటంతో అలాంటి పుకారు వచ్చిందేమో అని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ టైటిల్ కే చిత్ర యూనిట్ ఓటు వేసారంట. త్రివిక్రమ్ గత సినిమాలు ‘అతడు’ ‘అ ఆ’ ‘అజ్ఞాతవాసి’ ‘అల వైకుంఠపురంలో’ ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాల టైటిల్స్ ‘అ’ అక్షరంతో స్టార్ట్ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here