ఇక నాన్ ప్రభాస్ రికార్డ్ అని చెప్పుకోవాలేమో ఈ క్రేజ్ చూస్తుంటే! | 123Josh.com
Home న్యూస్ ఇక నాన్ ప్రభాస్ రికార్డ్ అని చెప్పుకోవాలేమో ఈ క్రేజ్ చూస్తుంటే!

ఇక నాన్ ప్రభాస్ రికార్డ్ అని చెప్పుకోవాలేమో ఈ క్రేజ్ చూస్తుంటే!

0
619

‘బాహుబలి’ తో రాజమౌళి అన్ని రికార్డులకు పూర్తిగా చెక్ పెట్టాడు. అయితే దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది డార్లింగ్ ప్రభాస్ ను రికార్డ్స్ నుండి పక్కకు తప్పించేందుకు నాన్ – బాహుబలి రికార్డ్స్ అంటూ కొత్త పదాన్ని.. రికార్డుల్లో కొత్త కేటగిరీని సృష్టించారు.  అంటే రికార్డులన్నిటికీ ప్రభాస్ పేరును దూరంగా ఉంచుతారన్నమాట. 

మరి కొంతమంది అయితే ప్రభాస్ ఘనతను తగ్గించేందుకు ‘బాహుబలి’ అంటే రాజమౌళి సినిమా అని.. ప్రభాస్ గొప్పదనమేమీ లేదన్నట్టుగా కొత్త లాజిక్ కూడా తీసుకొచ్చారు.  అయితే ఇదే రాజమౌళి ఇతర హీరోలతో బ్లాక్ బస్టర్లు సాధిస్తే మాత్రం అది ఆ సినిమాలో నటించిన స్టార్ల ఘనత అంటారు! కట్ చేస్తే ఇప్పుడు ‘సాహో’ రిలీజ్ కు సమయం ఆసన్నమైంది. 

మన బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ హీరోల హయ్యెస్ట్ బిజినెస్ కూడా ‘సాహో’కు జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం కూడా లేదు.  ఇక ‘సాహో’ ట్రైలర్ వ్యూస్ రికార్డ్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ ఊపు చూస్తుంటే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వందల కోట్ల వసూళ్లను అవలీలగా సాధించేలా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈలెక్కన ‘బాహుబలి’ రికార్డులకు ‘సాహో’ ఎసరు పెట్టినా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here