ఇక బాక్స్ ఆఫీస్ దద్దరిల్లి పోవడం ఖాయం…కాచుకోండి ఇక!! | 123Josh.com
Home గుసగుసలు ఇక బాక్స్ ఆఫీస్ దద్దరిల్లి పోవడం ఖాయం…కాచుకోండి ఇక!!

ఇక బాక్స్ ఆఫీస్ దద్దరిల్లి పోవడం ఖాయం…కాచుకోండి ఇక!!

0
3477

గుబురు గడ్డంతో కొన్నాళ్లుగా దర్శనమిస్తున్న పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా కొత్త లుక్ లో కనిపించారు. సినిమాలు చేయను.. సమయం మొత్తం రాజకీయాలేనని చెప్పిన జనసేనాధినేత తన మాటలకు భిన్నంగా ఒకేసారి

మూడు సినిమాలకు ఓకే చెప్పేయటం ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఆయన.. మొన్నటి వరకూ గుబురు గడ్డంతోనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గ జనసేన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు పవన్.

ఈ సందర్భంగా క్లీన్ షేవ్ తో.. గుబురు మీసాలతో.. ఒత్తైన జుట్టుతో ఈ మీటింగ్ కు హాజరయ్యారు. దీంతో.. గడిచిన కొద్ది నెలలుగా భారీ గడ్డంతో కనిపిస్తున్న పవన్.. తాజా లుక్ చూస్తే.. పాత పవన్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుందన్న మాట వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here