ఇక సినిమాలు చేయను అంటూ నిఖిల్ షాకింగ్ కామెంట్స్!! | 123Josh.com
Home న్యూస్ ఇక సినిమాలు చేయను అంటూ నిఖిల్ షాకింగ్ కామెంట్స్!!

ఇక సినిమాలు చేయను అంటూ నిఖిల్ షాకింగ్ కామెంట్స్!!

0
2282

హిట్ సినిమా కావాలంటే సులువైన మార్గం రీమేక్ అని చాలామంది హీరోలు.. నిర్మాతలు నమ్ముతారు.  దర్శకులకు రిస్క్ ఎక్కువ కాబట్టి రీమేక్ సినిమాలకు సహజంగా వ్యతిరేకంగా ఉంటారు.  సినిమాను బాగా తీస్తే దర్శకుడికి క్రెడిట్ ఇవ్వరు.. ఒకవేళ చెడగొడితే మాత్రం చెడుగుడు ఆడుకుంటారు.  దర్శకులకు ఇబ్బందే కానీ చాలామంది హీరోలు మాత్రం రీమేక్ సినిమాలకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈమధ్య యువహీరో నిఖిల్ కూడా రీమేక్ సినిమాల్లో నటించాడు.

  అయితే రీమేక్ సినిమాలలో ఇకపై నటించే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టాడు. నిఖిల్ గతంలో కన్నడ సూపర్ హిట్ ‘కిరిక్ పార్టీ’ రీమేక్ ‘కిరాక్ పార్టీ’ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది.  అదొక్కటే అనుకుంటే నాలుగు రోజుల క్రితం విడుదలైన నిఖిల్ కొత్త సినిమా ‘అర్జున్ సురవరం’ కూడా రీమేకే.  

తమిళ హిట్ ఫిలిం ‘కనిదన్’ రీమేకే ఈ సినిమా. ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ గొప్పగా అయితే లేవు.  నిఖిల్ ఆశించిన స్థాయి విజయం అయితే దక్కేలా లేదు. అసలు ఫుల్ రన్ తర్వాత కానీ ఇది హిట్టా కాదా అనేది క్లారిటీ రాదు.  దీంతో నిఖిల్ రీమేక్స్ అంటే భయపడ్డాడేమో కానీ ఫ్యూచర్ లో రీమేక్ సినిమాల్లో నటించనని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here