ఇది మెగాస్టార్ టైం…కాచుకోండి కొత్త భీభత్సానికి!! | 123Josh.com
Home గుసగుసలు ఇది మెగాస్టార్ టైం…కాచుకోండి కొత్త భీభత్సానికి!!

ఇది మెగాస్టార్ టైం…కాచుకోండి కొత్త భీభత్సానికి!!

0
1280

రెండేళ్ళకు పైగా నిరీక్షణలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఎదురుచూపులకు మొదటి బ్రేక్ రేపే పడనుంది. ప్రమోషన్ లో భాగంగా రేపు మధ్యాన్నం 3.45 కు మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఇది ముందే లీకైన న్యూస్ అయినప్పటికీ అధికారిక ప్రకటన వచ్చేదాకా ఏది నమ్మలేని పరిస్థితి ఉండేది.

కాని ఇప్పుడు అఫీషియల్ గా చరణ్ ఫేస్ బుక్ హ్యాండిల్ తో పాటు కొణిదెల ట్విట్టర్ లోనూ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. చిరు గంభీరంగా నడుచుకుంటూ వస్తున్న ఓ వార్ షాట్ ని మొహం కనిపించకుండా జాగ్రత్తగా పోస్టర్ లో పొందుపరిచారు.

సోషల్ మీడియాలో అప్పుడే దీని తాలుకు ట్రెండింగ్ మొదలైపోయింది. ఇంకో ఇరవై నాలుగు గంటలే కాబట్టి వీళ్ళంతా వైరల్ చేసే పనిలో పడ్డారు. రేపు మేకింగ్ వీడియో వస్తోంది కాబట్టి ఎల్లుండి ఆగస్ట్ 15 టీజర్ వచ్చే అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here